ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కథ ఇదేనా..?

Friday,May 26,2017 - 10:00 by Z_CLU

టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ . దాదాపు స్టార్ డైరెక్టర్స్ అందరితో పనిచేసిన ఎన్టీఆర్ ఒక్క త్రివిక్రమ్ తో మాత్రం ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. త్రివిక్రమ్ కూడా అంతే. ఆల్మోస్ట్ బడా హీరోలందరినీ డైరెక్ట్ చేశాడు కానీ ఎన్టీఆర్ తో ఇప్పటి వరకూ ఓ సినిమా చేయలేదు. ఇక ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ క్రేజీ కాంబో ఎట్టకేలకి సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తారక్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమా ఫినిష్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడట. అయితే మొన్నటి వరకూ ఈ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందా..అనే డౌట్ ప్రెజెంట్ అందరిలో మొదలైంది. అయితే ఈ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.