ఎన్టిఆర్ త్రివిక్రమ్ సినిమా..  టైటిల్ అదేనా ?

Sunday,May 13,2018 - 10:02 by Z_CLU

ఎప్పటి నుండి  అభిమానులు ఎదురుచూస్తున్న NTR- త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్  జరుపుకుంటున్న ఈ సినిమాకు లేటెస్ట్ గా  ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్రివిక్రమ్ గత  సినిమాలకు సంబంధించి షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండే  టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ టైటిల్ కూడా ఫస్ట్ లుక్ కంటే ముందే బయటికొచ్చేసింది. అలాగే తారక్ సినిమా టైటిల్ కూడా ఇదే అయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో తారక్ సాఫ్ట్ లుక్ తో కనిపిస్తూనే మాస్ హీరోగా అలరిస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకూ ఓన్లీ  యూత్ ఫుల్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఎంటర్ టైన్ చేసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తారక్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాదా కృష్ణ నిర్మిస్తున్నాడు.