ముంబై లో NTR కొత్త సినిమా సాంగ్స్

Tuesday,April 24,2018 - 03:23 by Z_CLU

రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది NTR, త్రివిక్రమ్ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మరోవైపు తమన్ ఈ సినిమా ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 2 సాంగ్స్ ని ఆల్రెడీ కంపోజ్ చేసిన తమన్, సినిమాలోని మిగతా సాంగ్స్ ని కూడా ఫినిష్ చేసుకునే పనిలో ఉన్నాడు.

‘జై లవకుశ’ లాంటి మాసివ్ హిట్ తరవాత సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కిస్తున్న సినిమా యూనిట్, ఈ సినిమాను దసరా కి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.