NTR సడెన్ గా బరువు తగ్గడానికి రీజన్ అదేనా...?

Friday,April 13,2018 - 12:56 by Z_CLU

NTR కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం RFC లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అప్పుడే ఈ సినిమాలో NTR ప్లే చేయనున్న క్యారెక్టర్ చుట్టూ డిఫెరెంట్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

జనతా గ్యారేజ్ తరవాత బ్రేక్ తీసుకుని మరీ 16 కిలోల బరువు తగ్గి, సరికొత్త మేకోవర్ తో సెట్స్ పైకి వచ్చిన NTR, ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడోనన్న డిస్కర్షన్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. NTR ఇంత తక్కువ టైమ్ లో అంతలా కష్టపడి బరువు తగ్గడం వెనక త్రివిక్రమ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా…? ఇంతకీ త్రివిక్రమ్ NTR ని ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేయనున్నాడు లాంటి పాయింట్స్ ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ పాయింట్స్ లా మారాయి.

 

త్రివిక్రమ్ మార్క్ లావిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.