NTR సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,April 13,2018 - 05:32 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NTR సినిమా సీజన్ బిగిన్ అయింది. ఈ రోజే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా పండగకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాలో NTR సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ షెడ్యూల్ లో మ్యాగ్జిమం యాక్షన్ పార్ట్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్, నెక్స్ట్ షెడ్యూల్ లో పూజా హెగ్డే కాంబినేషన్ లో సీన్స్ ని తెరకెక్కించనున్నారు.

 

ఈ రోజు రిలీజైన ఆన్ సెట్స్ స్టిల్స్ లో NTR స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 16 కిలోల బరువు తగ్గాడు NTR. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.