పొలిటికల్ డ్రామాతో ఎన్టీఆర్ సినిమా?

Wednesday,May 13,2020 - 11:02 by Z_CLU

కొందరు దర్శకులకి ఓ సెపరేట్ మార్క్ ఉంటుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే దర్శకుడెవరన్నది చెప్పొచ్చు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఓ సెపరేట్ స్టయిల్. ఆహ్లాదకరమైన కుటుంబం, కలతలు , హీరో వాటిని తీర్చి కుటుంబాన్ని మళ్ళీ ఎప్పటిలాగే నిలబెట్టడం… ఈ కంటెంట్ తో ఎక్కువగా సినిమాలు చేస్తాడు త్రివిక్రమ్.

అయితే తారక్ తో తొలిసారి చేసిన ‘అరవింద సమేత’ కి మాత్రం కొంచెం సీమ గొడవలు టచ్ చేసి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశాడు. ఇక అందులో పాలిటిక్స్ కూడా ఉండేలా చూసుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ తారక్ కోసం తన పంథాను మార్చుకొని ఓ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ కోసం ఓ కంప్లీట్ పొలిటికల్ యాక్షన్ కథను సిద్దం చేసి తుదిమెరుగులు దిద్డుతున్నాడట. ఇదే నిజమైతే ఓ పొలిటికల్ సబ్జెక్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఎన్టీఆర్ కల నెరవేరినట్టే.