నవంబర్ నుండి NTR త్రివిక్రమ్ సినిమా

Wednesday,May 10,2017 - 11:09 by Z_CLU

NTR త్రివిక్రమ్ సినిమాకి ఆల్ సెట్ అయింది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ సినిమాతో బిజీ బిజీగా ఉన్న NTR, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే నవంబర్ లో త్రివిక్రమ్ సినిమా కోసం ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ రెడీ యాక్షన్ చెప్పేశాడు మాటల మాంత్రికుడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మించనున్నాడు.

రేపోమాపో ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. రాశి ఖన్నా తో పాటు నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో NTR, 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.