ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

Thursday,May 17,2018 - 05:53 by Z_CLU

అంతా ఊహించినట్టే జరిగింది. యంగ్ టైగర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అయింది. ఈనెల 20న తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. సో.. సరిగ్గా పుట్టినరోజుకు కొన్ని గంటల ముందు ఎన్టీఆర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను 19వ తేదీ సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ కు ఇక్కడ మరో సర్ ప్రైజ్ ఏంటంటే.. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఆ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా ఒకేసారి రివీల్ చేయబోతున్నారు.

పుట్టినరోజుకు సంబంధించి ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై క్లారిటీ వచ్చేసింది. ఇక మరో సినిమా మాత్రమే పెండింగ్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఓ సినిమా రాబోతోంది. ఆ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి మెటీరియల్ రిలీజ్ చేస్తారో చూడాలి. దీనిపై రాజమౌళి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.