అటు త్రివిక్రమ్.. ఇటు కొరటాల

Friday,April 10,2020 - 02:08 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్న ఎన్టీఆర్… నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ సినిమా RRR షూట్ పూర్తవ్వగానే సెట్స్ పైకి వస్తుంది. ఈ లోపు మరో సినిమా ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు తారక్.

ఇప్పటికే ఎన్టీఆర్ కి కొరటాల ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో వెంటనే కొరటాల శివకి ఒకే చేప్పేశాడట యంగ్ టైగర్. ‘జనతా గ్యారేజ్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ కాంబినేషన్ లో ఇప్పటికే యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా అనౌన్స్ చేశారు.

త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వగానే కొరటాలతోనే తారక్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఈలోపు కొరటాల శివ కూడా ‘ఆచార్య’ సినిమాను రిలీజ్ చేసి తారక్ సినిమా స్క్రిప్ట్ పైకి షిఫ్ట్ అవుతాడని టాక్.