RamarajuForBheem - ముహూర్తం ఫిక్స్

Tuesday,October 20,2020 - 02:01 by Z_CLU

NTR ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న #RRRMovie మోస్ట్ ఎవైటింగ్ టీజర్ రాబోతుంది. RamarajuForBheem పేరుతో రిలీజ్ కానున్న తారక్ టీజర్ కి సంబంధించి ఇప్పటికే అక్టోబర్ 22న ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా సమయాన్ని కూడా చెప్పేశారు.

అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ తో సోషల్ మీడియాలో సునామి మొదలు కానుంది. అవును తారక్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినిమా అభిమానులంతా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే BheemforRamaraju టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పిన రాజమౌళి ఇప్పుడు RamarajuForBheem టీజర్ తో ఆ అంచనాలను ఇంకా ఏ స్థాయికి తీసుకువెళతాడా అనే డిస్కషన్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించి వర్క్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా షూట్ చేసిన తారక్ షాట్స్ ను ఇందులో జత చేస్తూ ఎడిటింగ్ చేయిస్తున్నాడు జక్కన్న.