RRR టీజర్ అప్పుడేనా?

Wednesday,September 23,2020 - 02:13 by Z_CLU

ప్రస్తుతం NTR ఫ్యాన్స్ RRR నుంచి తారక్ వెర్షన్ టీజర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా Rajamouli అండ్ టీంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సినిమాలో మరో హీరోగా కనిపించనున్న RamCharan వెర్షన్ టీజర్ ను చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన మేకర్స్ NTR పుట్టిన రోజుకి లాక్ డౌన్ కారణంగా టీజర్ రిలీజ్ చేయలేకపోయారు. కనీసం బర్త్ డే కి ఫస్ట్ లుక్ కూడా వదలకపోవడంతో తారక్ ఫ్యాన్స్ టీంపై మండిపడుతున్నారు.

అయితే తారక్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుంటూ సినిమా నుండి రెండో టీజర్ ను వీలైనంత తొందరగా రిలీజ్ చేసే పనిలో నిమగ్నమవుతున్నాడు జక్కన్న. త్వరలోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న షూట్ లో ఎన్టీఆర్ టీజర్ కి సంబంధించి కొన్ని షాట్స్ తీయబోతున్నారు. వాటిని జత చేసి వీలైనంత త్వరగా టీజర్ ను విడుదల చేయాలని చూస్తున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా కి RRR నుండి తారక్ వెర్షన్ గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.