అరవింద సమేత సక్సెస్ కి అదే రీజన్ – NTR

Thursday,October 18,2018 - 10:06 by Z_CLU

సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అరవింద సమేత. కథను కథగా చెప్పాం కాబట్టే ఈ రేంజ్ సక్సెస్ దక్కింది అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. మరీ ముఖ్యంగా రెగ్యులర్ సినిమాల తరహాలో డ్యాన్స్ నంబర్స్, కామెడీ ఎలిమెంట్స్ లేకపోయినా, సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే, టాలీవుడ్ లో మరిన్ని జెన్యూన్ కథలు పుట్టుకొస్తాయని చెప్పుకున్నాడు NTR.

దసరా సందర్భంగా ఈ సినిమా సక్సెస్ ని షేర్ చేసుకున్న NTR ‘ఈ సినిమా కథ,  ఎక్కడా కామెడీని డిమాండ్ చేయలేదు కాబట్టే కామెడీ పెట్టలేదు. ఈ కథకి అసలు కామెడీ అవసరమే లేదు. ఒకవేళ కావాలని కామెడీ పెట్టినా, అది నాన్ సింక్ అయ్యేది డెఫ్ఫినేట్ గా, ఆ క్లారిటీ త్రివిక్రమ్ గారికి బిగినింగ్ నుండి ఉంది. అందుకే ఈ సినిమా ఇంత  సక్సెస్ అయింది ’ అని చెప్పుకున్నాడు.

‘త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఒక కథను, కథలా అంతే జెన్యూన్ గా చెప్పడం, దానిని ప్రేక్షకులు ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకోవడంతో, తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కథలు పుట్టుకొస్తాయి’ అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు త్రివిక్రమ్.

దసరాకి పర్ఫెక్ట్ ట్రీట్ అనిపించుకుంటున్న ‘అరవింద సమేత’ వసూళ్ళ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీకెండ్ దాటీ దాటగానే కలిసొచ్చిన పండగ సీజన్, అరవిందసమేతకి మరింత క్రేజ్ ని తెచ్చిపెడుతుంది. ఈ సినిమా హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది.