సిక్స్ ప్యాక్ డీటెయిల్స్ బయటపెట్టిన ఎన్టీఆర్

Monday,October 08,2018 - 11:48 by Z_CLU

అరవింద సమేతలో ఎన్నో ఎట్రాక్షన్స్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది మెయిన్ ఎట్రాక్షన్స్ సిక్స్ ప్యాక్. అప్పుడెప్పుడో టెంపర్ టైమ్ లో ఓసారి తనలోని సిక్స్ ప్యాక్ చూపించాడు యంగ్ టైగర్. మళ్లీ ఇన్నేళ్లకు అరవింద సమేతలో సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు. ఈ డీటెయిల్స్ ను మీడియాతో షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

“సిక్స్ ప్యాక్ ను సినిమాలో ఓ ఐటెం చేద్దామనేది మా ఉద్దేశం కాదు. మూవీలో చూస్తే నా సిక్స్ ప్యాక్ ఎంట్రీ చాలా నేచురల్ గా ఉంటుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, కెమెరామెన్ వినోద్, అసిస్టెంట్ డైరక్టర్లు, త్రివిక్రమ్.. ఇలా అందరూ కలిసి ఆ సీక్వెన్స్ ను బాగా తీశారు. ఏదో కావాలని పెట్టినట్టు సిక్స్ ప్యాక్ ఉండదు.”

సినిమాలో చాలా ఎమోషనల్ సీక్వెన్స్ లో తన సిక్స్ ప్యాక్ ఎంట్రీ వస్తుందని, అలాంటి టైమ్ లో సీన్ కంటే తన సిక్స్ ప్యాక్ పై ఆడియన్స్ ఫోకస్ పడితే సీన్ పండదని, అందుకే చాలా నేచురల్ గా ఫ్లోలో వచ్చేలా ఆ సీన్ ప్లాన్ చేశామంటున్నాడు ఎన్టీఆర్. సినిమాలో తన సిక్స్ ప్యాక్ సన్నివేశం అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నాడు.