ఎన్టీఆర్ ఇంటికి భార్గవ రాముడు

Wednesday,July 04,2018 - 06:06 by Z_CLU

నందమూరి తారక రామారావు ఇంటికి భార్గవ రాముడు వచ్చాడు. ఇక్కడ నందమూరి తారక రామారావు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక భార్గవ రాముడంటే ఎవరో తెలుసా..? ఇంకెవరు ఎన్టీఆర్ చిన్నకొడుకు. అవును.. రీసెంట్ గా ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు పుట్టిన రెండో కొడుక్కి భార్గవ రామ్ అనే పేరు పెట్టారు. ఈ ఫంక్షన్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది.

తన చిన్న కొడుక్కి భార్గవ రామ్ అనే పేరుపెట్టినట్టు స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు. కేవలం ఎనౌన్స్ చేసి ఊరుకోలేదు. పెద్దోడు, చిన్నోడు, భార్య ప్రణతితో కలిసి దిగిన మొట్టమొదటి ఫ్యామిలీ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత అనే సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ స్టిల్ కు అరవింద సమేత హ్యాష్ ట్యాగ్ తగిలించి ట్రెండ్ చేస్తున్నాడు నందమూరి ఫ్యాన్స్. మొత్తానికి చిన్నోడికి కూాడా భార్గవ రామ్ అనే పేరు పెట్టి, పేరులో ‘రామ్’ అనే సెంటిమెంట్ ను కొనసాగించాడు యంగ్ టైగర్.