టీజర్ తో రెడీ అవుతున్న ఎన్టీఆర్

Sunday,June 04,2017 - 10:04 by Z_CLU

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన మరో సప్రయిజ్ తో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీరామనవమి కి టైటిల్ లోగో ను అనౌన్స్ చేసి ఫాన్స్ ను ఖుషి చేసిన తారక్ లేటెస్ట్ గా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో ఆ ఖుషి మరింత రెట్టింపు చేసి సినిమా పై అంచనాలను పెంచేశాడు.

ఇప్పటికే ఈ సినిమా విషయం లో చాలా ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్ కు త్వరలోనే టీజర్ తో సప్రయిజ్ చేయబోతున్నాడు ఎన్టీఆర్ . గతేడాది రంజాన్ కి ‘జనతా గ్యారేజ్’ టీజర్ తో శుభాకాంక్షలు తెలిపిన తారక్ ఈ రంజాన్ కి కూడా జై లవకుశ టీజర్ తో విష్ చేయబోతున్నాడని సమాచారం. సో ఇదే నెలలో ఎన్టీఆర్ టీజర్ తో మరో సారి సప్రయిజ్ చేస్తాడన్నమాట..