తాతగారు బయోపిక్ పై ఎన్టీఆర్ రియాక్షన్

Saturday,July 08,2017 - 04:38 by Z_CLU

నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర త్వరలోనే వెండితెరపై రానుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ కు దర్శకుడు. సీనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా వెండితెరపై ఆవిష్కరిస్తాడట వర్మ. ఇదిలా ఉండగా ఈ బయోపిక్ లో నటసింహం బాలకృష్ణ నటించనున్నాడనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తోంది. ఈ న్యూస్ పై యంగ్ టైగర్ రియాక్ట్ అయ్యాడు.

తాతగారి బయోపిక్ లో బాలయ్య నటిస్తే బ్రహ్మాండంగా ఉంటుందంటున్నాడు ఎన్టీఆర్. తెలుగుతెరపై ఇదే అతిపెద్ద సినిమా అవుతుందంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అయితే ఈ బయోపిక్ లో బాలయ్య నటిస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఎన్టీఆర్ జీవితంపై సినిమా చేస్తానని ప్రకటించిన వర్మ, తన ప్రకటనలో ఎక్కడా బాలకృష్ణ పేరు ప్రస్తావించలేదు.