సీన్ రివర్స్ ... కారణం అదే ?

Saturday,December 10,2016 - 10:00 by Z_CLU

ఓ డైరెక్టర్ ఓ హీరో తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని, అంతలోనే ఆ డైరెక్టర్ మరో హీరో తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు వింటూనే ఉంటాం. ఇది సహజమే అయితే లేటెస్ట్ గా ఇద్దరు హీరోలు మాత్రం ఓ ఇద్దరు డైరెక్టర్స్ ను ఎక్స్ చేంజ్ చేసుకొని సినిమాలు చేసేందుకు రెడీ అవుతూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు.

ఆ ఇద్దరు మరెవరో కాదు ఎన్టీఆర్, రవి తేజ టాలీవుడ్ లో రవి తేజ అందరు హీరోలతో మంచి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ తో కూడా రవి తేజ చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇందుకు ఉదాహరణ రవి తేజ నటించిన కొన్ని సినిమాల ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ అటెండ్ అవ్వడమే. ఆ రిలేషన్షిప్ తోనే లేటెస్ట్ గా ఈ ఇద్దరు వీళ్ళ నెక్స్ట్ సినిమా డైరెక్టర్స్ ను ఎక్స్ చేంజ్ చేసుకున్నారట. ఇక మొన్నటి వరకూ రవి తేజ తో బాబీ మరో సినిమా చేయబోతున్నాడని వార్త వినిపించగా, ఎన్టీఆర్ అనిల్ రవి పూడి తో సినిమా చేయబోతున్నాడనే వార్త కూడా వినిపించింది. ఇద్దరి సినిమాలు దాదాపు ఖాయమనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి .

final-collage

అయితే లేటెస్ట్ గా వీరిద్దరి సీన్ రివర్స్ అయింది. అనుకోకుండా ఎన్టీఆర్ బాబీ తో , రవి తేజ అనిల్ రవిపూడి తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. మరి ఉన్నట్టుండి ఈ ఇద్దరి డైరెక్టర్ల సీన్ రివర్స్ అవ్వడానికి ఎన్టీఆర్ , రవి తేజ ఫ్రెండ్షిప్ ఏ కారణమనే టాక్ వినిపిస్తుంది.