రామ్ చరణ్, ఎన్టీఆర్ "కరోనా" వీడియో

Tuesday,March 17,2020 - 12:55 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాపై ఎవేర్ నెస్ కల్పించేందుకు ముందుకొచ్చారు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ హీరోలిద్దరూ కలిసి వివరించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు, ఇలా కరోనాపై అవగాహన కల్పిస్తూ వీడియో చేయడం మెచ్చుకోదగ్గ విషయం.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే చిరంజీవి లాంటి హీరోలు షూటింగ్స్ ఆపేశారు. రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉన్నాడు.