RRR - అల్లూరి, భీమ్ పోరాటం చేయరంట

Monday,October 12,2020 - 04:56 by Z_CLU

RRR.. స్వతంత్ర పోరాటం నేపథ్యంలో వస్తున్న సినిమా. ఇందులో యంగ్ అల్లూరి సీతారామరాజుగా RamCharan, పవర్ ఫుల్ కొమరం భీమ్ పాత్రలో NTR కనిపించబోతున్నారు.

ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ కు చెందిన పాత్రలతో సినిమా వస్తోంది కాబట్టి, కచ్చితంగా RRR లో స్వతంత్ర పోరాటాన్ని గ్రాండ్ స్కేల్ లో చూపిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ యూనిట్ మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చింది.

“సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేయవు. RRR అనేది పూర్తిగా ఫిక్షనల్, ఇది దేశభక్తి చిత్రం కానేకాదు.”

ఇలా అల్లూరి, భీమ్ పాత్రలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది యూనిట్. వీళ్లిద్దరూ స్వతంత్రం కోసం పోరాటం చేయకపోతే, మరి సినిమాలో దేని కోసం వీళ్లు కలిసి ఫైట్ చేయబోతున్నారనేది ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

Also Read – RRR నుంచి ఎన్టీఆర్ టీజర్