ఎన్టీఆర్... అదే ప్లానింగ్ తో వెళ్తున్నాడా?

Thursday,June 04,2020 - 12:49 by Z_CLU

#NTR30 ప్రాజెక్టును ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సినిమాను చేయబోతున్నాడు తారక్. ప్రస్తుతం ‘RRR’ షూటింగ్ వాయిదా పడటంతో తారక్ -త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతుంది. అయితే RRR షూట్ అవ్వగానే త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న ఎన్టీఆర్… మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా చర్చలు జరుపుతున్నాడు.

అవును… ‘KGF2’ తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ తో ఓ పాన్ ఇండియా సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు. తెలుగు , కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో సినిమా ప్లానింగ్ జరుగుతుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను కన్ఫర్మ్ చేసిన మైత్రీ నిర్మాతలు మరోసారి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన మైత్రి నిర్మాతలు ప్రశాంత్ నీల్ ని రేడియేషన్ సూట్ లో కలవడానికి ఎదురుచూస్తున్నాం అని సోషల్ మీడియాలో తెలియజేశారు.

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజుకు ప్రశాంత్ నీల్ విశెష్ చెబుతూ.. తారక్ పవర్ ప్లాంట్ లాంటోడని, అతడితో సినిమా అంటే రేడియేషన్ సూట్ వేసుకోవాలని ట్వీట్ చేశాడు. అందుకే మైత్రీ నిర్మాతలు ఇలా రేడియేషన్ సూట్ లో కలుద్దాం అని అతడి పుట్టినరోజుకు ట్వీట్ చేశారు. అంటే తారక్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్టే.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి తారక్ ను ప్రశాంత్ ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.