మరో యంగ్ టైగర్ పుట్టాడు

Thursday,June 14,2018 - 03:08 by Z_CLU

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. ఎన్టీఆర్‌, ప్రణతిల కుటుంబంలోకి అభయ్ రామ్ తర్వాత మరో వారసుడు వచ్చేశాడు. అవును, ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఎన్టీఆర్‌ స్వయంగా తానే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. ‘తనకు కొడుకు పుట్టాడని, రెండో కొడుకు రాకతో తన కుటుంబం మరింత పెద్దదైంది’ అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కి వెంటనే అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఎన్టీఆర్ ట్విటర్ పేజ్ మొత్తం కంగ్రాట్స్ సందేశాలతో నిండిపోయింది. ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్ రామ్‌ సహా అతడి కుటుంబసభ్యులు, టాలీవుడ్ ప్రముఖులు  ఎన్టీఆర్‌-ప్రణతికి శుభాకాంక్షలు తెలిపారు.

తారక్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న అరవింద సమేత సినిమా సెట్స్‌పై ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. ఈ మూవీ తర్వాత రాజమౌళితో సినిమా చేస్తాడు యంగ్ టైగర్.