యూరోప్ టూర్ ప్లాన్ చేస్తున్న NTR

Friday,September 29,2017 - 11:25 by Z_CLU

NTR జై లవకుశ సూపర్ హిట్ అయింది. తన కరియర్ లోనే 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన NTR జై క్యారెక్టర్ లో అందరినీ మెస్మరైజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే అప్పుడే ఫ్యాన్స్ దృష్టి NTR నెక్స్ట్ చేయబోయే సినిమాపై పడింది.

పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తరవాత ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న NTR, ఫ్యామిలీ తో యూరోప్ టూర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ టూర్ కి సంబంధించి ఇంకా ఎగ్జాక్ట్  డీటేల్స్ అయితే రాలేదు కానీ, బ్రేక్ తరవాతే తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు NTR.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న NTR నెక్స్ట్ సినిమా ఆల్ మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంది. మ్యాగ్జిమం నవంబర్ లేదా డిసెంబర్ కల్లా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడనే టాక్ టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.