షూటింగ్ అప్ డేట్స్

Saturday,August 18,2018 - 11:50 by Z_CLU

అరవింద సమేత
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, పూజా హెగ్డే లతో పాటు మరికొంత మంది ఆర్టిస్టుల పై కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కీ రోల్ ప్లే చేస్తుంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

పడి పడి లేచె మనసు
కోల్ కతాలో రెండు షెడ్యూల్స్ పూర్తిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో శర్వానంద్, సాయి పల్లవిపై కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

హలో గురు ప్రేమ కోసమే
రామ్, అనుపమ జంటగా తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇప్పటికే హైదరాబాద్, కాకినాడలో కొన్ని షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి 21వ తేదీ నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

నిహారిక – రాహుల్ విజయ్ సినిమా
రాహుల్ విజయ్ – నిహారిక కొణిదెల హీరోహీరోయిన్స్ గా  తెరకెక్కుతున్న లవ్ ఎంటర్ టైనర్ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్, రాజస్థాన్ లో మరో షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. సెప్టెంబర్ లో 10 రోజుల పాటు  జరగనున్న హైదరాబాద్ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నారు. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.