త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఫిక్స్...

Tuesday,December 20,2016 - 06:00 by Z_CLU

వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న స్టార్ డైరెక్టర్ తో తమ అభిమాన హీరో ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఆ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు స్టార్ హీరోల ఫ్యాన్స్. అలా ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎట్టకేలకి కుదిరిందట.

   చాలా సంవత్సరాల నుంచి యంగ్ టైగర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త నిజమైతే బాగుంటుందని, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ అదరగొడతాడని ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు తారక్ అభిమానులు. మోస్ట్ ఎవెయిటింగ్ గా మారిన ఈ కాంబో ను సెట్స్ పైకి తీసుకురావడాానికి  రెడీ అవుతున్నాడు నిర్మాత రాధాకృష్ణ.

S Radhakrishna, Trivikram Srinivas @ A Aa Movie Pooja Stills

ప్రెజెంట్  త్రివిక్రమ్ తో కంటిన్యూస్ గా సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాత  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించేందుకు డిసైడ్ అయ్యాడట . లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా గురించి ఓ డిస్కషన్ కూడా జరిగినట్టు టాక్. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఎండింగ్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ సినిమా ఉంటుంది.