సెన్సేషనల్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ఫిక్స్

Sunday,July 14,2019 - 12:30 by Z_CLU

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఅర్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసేసుకున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు తారక్. ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా నిర్మాతే సినిమాను కన్ఫర్మ్
చేసారు.

ఎన్టీఆర్ గారి కి కే.జీ.ఎఫ్ సినిమా బాగా నచ్చింది. ఆయనే మాకు ప్రశాంత్ ని సజిస్ట్ చేసారు. ప్రస్తుతానికి సినిమా ప్రాసెస్ లో ఉంది. ప్రశాంత్ ఇంకా కథ చెప్పలేదు. ఎన్టీఆర్ గారు ‘ఆర్.ఆర్.ఆర్’ , ప్రశాంత్ ‘కే.జీ.ఎఫ్ చాప్టర్ 2’ కంప్లీట్ చేయాలి. ఇంకా టైం పడుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో సినిమా ఉండొచ్చు. అని తెలిపారు నవీన్.

సో ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో ఏ హీరోతో సినిమా చేస్తాడా.. అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చేసాడు మైత్రి నిర్మాత. మరి ప్రశాంత్ తారక్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. ఈ కాంబో సినిమా ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తుందో..చూడాలి.