ఆ ఇద్దరితో ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ?

Sunday,April 09,2017 - 12:00 by Z_CLU

‘టెంపర్’,’నాన్నకు ప్రేమతో’,’జనతా గ్యారేజ్’ వంటి వరుస విజయాల తర్వాత లేటెస్ట్ గా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరమే త్రివిక్రమ్ తో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా..? అని ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే తారక్ మాత్రం ఈ సినిమా తరువాత జక్కన్న తో ఓ సినిమా అలాగే వినాయక్ తో మరో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ ఇద్దరిలో ముందుగా తారక్ ఎవరితో సెట్స్ పైకి వెళ్తాడన్నది మాత్రం సస్పెన్సే…