ముచ్చటగా మూడో సారి....

Sunday,October 16,2016 - 12:29 by Z_CLU

తాజాగా జనతా గ్యారేజ్ తో గ్రాండ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు. ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా? అని ఎదురూచూస్తున్న అభిమానులకు త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ చెప్పబోతున్నాడు.

ntr-and-puri-jagannath

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను పూరి జగన్నాధ్ తో చేయడానికి సిద్దమవుతున్నాడట. ఇప్పటికే యంగ్ టైగర్ కి ఓ కథ ను వినిపించాడట పూరి. ఈ కథ తారక్ బాగా నచ్చడంతో మళ్ళీ జగన్ కే ఓటేశాడట. అప్పట్లో ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ కు ‘టెంపర్’ సినిమాతో విజయాల దిశగా నడిపించిన పూరి… ఈ సినిమాతో తనకు మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆలోచనలో ఉన్నాడట తారక్. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.