ఇంకా వీడని సస్పెన్స్..

Thursday,October 27,2016 - 09:30 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై ఇంకా క్లారిటీ రాలేదు. తారక్ నటించిన లేటెస్ట్ సినిమా ‘జనతా గ్యారేజ్’ టి.వి లో కూడా టెలికాస్ట్ అయిపోయింది. కానీ నెక్ట్ సినిమా గురించి ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు ఎన్టీఆర్. పూరి తో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపించినప్పటికీ… ఈ సినిమా పై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.

   ఇజం సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఆ సక్సెస్ మీట్ పై కూడా సస్పెన్స్ నడుస్తోంది. ఒక వైపు స్టార్ హీరోలందరూ సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతుండగా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంత లేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ వారంలోనే ఓ ప్రకటన ఉంటుందనే వార్తలు వస్తున్నాయి కాబట్టి… మరో 2 రోజుల్లో ఎన్టీఆర్ కొత్త సినిమా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది.