డైలమాలో ఎన్టీఆర్ ?

Thursday,December 29,2016 - 08:00 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ను సెట్స్ పై తీసుకెళ్లడానికి  రెడీ అవుతున్నాడు . ‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తారక్  ఫాన్స్ తో పాటు సినిమా లవర్స్ అందరికీ తన నెక్స్ట్ సినిమాతో గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో జనవరి నుంచి సెట్స్ పైకి   వెళ్లనున్న  ఈ సినిమా టైటిల్ విషయం లో ఎన్టీఆర్  కన్ఫ్యూజ్ అవుతున్నాడని సమాచారం  .

   ఇండస్ట్రీ లో  సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్ మూడు డిఫరెంట్ గెటప్స్ తో ఎంటర్టైన్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమా కథ కు తగ్గట్టు గా ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ తో పాటు ‘త్రీమూర్తులు’ అనే టైటిల్స్ ను యూనిట్ పరిశీలిస్తున్నారని టాక్.  ఈ రెండు టైటిల్స్ కథ కు పర్ఫెక్ట్ అయినప్పటికీ ఈ టైటిల్స్ ను ప్రెజెంట్ జెనెరేషన్ ఆడియన్స్ ఎలా రీసీవ్ చేసుకుంటారా? అనే డైలమాలో తారక్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి యంగ్ టైగర్ ఈ సినిమాకు ఏ టైటిల్ ను డిసైడ్ చేస్తాడో ? చూడాలి .