ముహూర్తం ఖరారు..

Thursday,October 13,2016 - 01:31 by Z_CLU

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానని, ఆ తర్వాతే కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తానని తారక్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడో చెప్పి రెస్ట్ తీసుకుంటే బాగుండేది. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడంతో యంగ్ టైగర్ నయా మూవీపై రోజుకో గాసిప్ పుట్టుకొస్తోంది.

1468651221-1620

        తాజా సమాచారం ప్రకారం… తన కొత్త సినిమాను ఇజం సక్సెస్ మీట్ లో ప్రకటిస్తాడట ఎన్టీఆర్. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇజం సినిమా.. ఈనెల 21న విడుదల అవుతుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్… సినిమా ప్రమోషన్ లో కూడా భాగం కావాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా సక్సెస్ మీట్ కు కూడా హాజరై… అదే వేదికపైన తన నెక్ట్స్ సినిమాను ప్రకటిస్తాడట తారక్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే తారక్ తన నెక్ట్స్ మూవీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్.