NTR సినిమాకి డేట్ ఫిక్సయింది

Wednesday,January 18,2017 - 05:15 by Z_CLU

జనతా గ్యారేజ్ తర్వాత మేక్ ఓవర్ కోసమా.. ప్రీ ప్రొడక్షన్ కోసమా… బ్రేక్ కోసమా… ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాడో ఖచ్చితంగా తెలీదు కానీ, NTR మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. బాబీ తో NTR ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కన్ఫం చేసినా, ఈ సినిమాని ఇంకా సెట్స్ పైకి తీసుకురాలేదు.

మరో వైపు ఈ సినిమాకి సంబంధించి ఏ అప్ డేట్ వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ డేట్ ఇంటరెస్టింగ్ గా వినిపిస్తుంది. అదే ఫిబ్రవరి 11. సినిమా యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే అనౌన్స్ కాలేదు కానీ, సినిమా మాత్రం ఫిబ్రవరి 11 న సెట్స్ పైకి రావడం ఖాయం అని ఇన్ సైడ్ సోర్సెస్ స్ట్రాంగ్ గా డిక్లేర్ చేస్తున్నాయి.

ఈ మూవీకి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాకే సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఇందులో NTR… 3 ఇంటరెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడు.