ఎల్బీ స్టేడియంలో మహానాయకుడు

Friday,February 01,2019 - 05:52 by Z_CLU

ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లలోకి వచ్చేసింది. పార్ట్-2 కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీనికి కారణం సినిమాకు సంబంధించి ఓ కీలకమైన ఎపిసోడ్ పెండింగ్ లో పడడమే.

అవును.. మహానాయకుడు సినిమాకు సంబంధించి కీలకమైన ఓ ఎపిసోడ్ ను రీసెంట్ గా షూట్ చేశారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్యపై ఎల్బీ స్టేడియంలో ఈ ఎపిసోడ్ తీశారు. భారీ స్పీచ్ తో పాటు కాస్త భావోద్వేగంతో కూడిన కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు.

తాజా షెడ్యూల్ తో ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. షూట్ కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరుకు మహానాయుకుడు థియేటర్లలోకి వస్తాడు