NTR ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ మారింది

Wednesday,December 19,2018 - 03:50 by Z_CLU

ఈ నెల 21 న గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకోనుంది NTR బయోపిక్ టీమ్. అదే రోజున ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజవుతుంది. అయితే ఈ బయోపిక్ లోని ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’  జనవరి 9 న రిలీజవుతున్న విషయం తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’ ని ఫిబ్రవరి 7 న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

‘కథానాయకుడు’ లో కంప్లీట్ ఫోకస్ NTR యాక్టింగ్ కరియర్ పై పెట్టిన మేకర్స్, ఈ పార్ట్ లో ఆయన సినిమా జర్నీ, ఈ ప్రాసెస్ లో ఆయనకు దగ్గరైన లెజెండ్రీ యాక్టర్స్, వాళ్ళతో NTR కి ఉన్న సాన్నిహిత్యం లాంటి అంశాలను ప్రెజెంట్ చేయనున్న మేకర్స్, ‘మహానాయకుడు’ లో ఆయన రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు లాంటి అంశాలను ప్రెజెంట్ చేయనున్నారు.

కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ NTR సతీమణి బసవ తారకం రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.