'NTR మహానాయకుడు'... అదిరిపోనున్న కాంబో

Tuesday,October 23,2018 - 10:02 by Z_CLU

‘NTR’ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే … నందమూరి తారక రామారావు సినీ జీవితాన్ని “NTR కథానాయకుడు ” ద్వారా చూపిస్తుండగా రాజకీయ జీవితాన్ని ‘NTR మహానాయకుడు’ ద్వారా చూపించబోతున్నారు.. అయితే ఈ రెండు భాగాల్లో అందరినీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తుంది ‘మహానాయకుడు’. నిజానికి నందమూరి తారకరామారావు గారి సినీ జీవితం కంటే రాజకీయ జీవితాన్ని ఎలా చూపించబోతున్నరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘మహానాయకుడు’ లో చంద్ర బాబు నాయుడు గా రానా, హరి కృష్ణ గా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. బాలయ్య బాబుతో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించే సన్నివేశాలు చాలా రసవత్తరంగా తెరకెక్కిస్తున్నారట. నిజానికి ఈ రెండు పాత్రలు రామారావు గారి రాజకీయ జీవితంలో చాలా కీలకం.. అందుకే ఈ పాత్రలు కొన్ని నిమిషాలకే పరిమితం కాకుండా కాస్త ఎక్కువ నిడివి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ స్థాపించే సన్నివేశాలు, బాలయ్య -రానా మధ్య వచ్చే సన్నివేశాలు, ఎన్నికల సమయంలో తండ్రికి రథ సారధిలా నిలిచిన హరికృష్ణ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.

ఏదేమైనా ‘మహానాయకుడు’ పార్ట్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. మరి NTR పార్ట్ 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.