NTR ‘లవ’ టీజర్ రిలీజ్ కి రెడీ

Thursday,August 03,2017 - 10:41 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘జై’ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెగెటివ్ రోల్ లో NTR కొత్త అవతారం ఫ్యాన్స్ ని మెస్మరైజ్  చేసేసింది. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ ఇంపాక్ట్ చేయడానికి ‘లవ’ టీజర్ రిలీజ్ కానుంది. ఆగష్టు 7 న, రాఖీ పండగ సందర్భంగా మార్నింగ్  10:35 కి ఈ టీజర్ ని రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

ఈ సినిమాలో మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లలో కనిపించనున్నాడు NTR. రీసెంట్ గా రిలీజైన ‘జై’, రిలీజ్ కి రెడీ అవుతున్న ‘లవ’, ఈ రెండు టీజర్ ల తరవాత రాబోయే మూడో క్యారెక్టర్ టీజర్ పై కూడా ఇప్పటి నుండే బోలెడంత డిమాండ్ క్రియేట్ అయి ఉంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

 

నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రోనిత్ విలన్ గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.