ఎన్టీఆర్ నుంచి మరో బర్త్ డే గిఫ్ట్

Saturday,May 20,2017 - 10:43 by Z_CLU

తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో కానుక అందించాడు యంగ్ టైగర్. ఇప్పటికే జై లవకుశ ఫస్ట్ లుక్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. మరో క్రేజీ ప్రాజెక్టు ప్రకటించాడు. దర్శకుడు కొరటాల శివతో మరో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు.  వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు

యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్టీఆర్-కొరటాల కాంబోలో సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఎన్టీఆర్ స్టిల్ తో ఓ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.


ప్రస్తుతం బాబి దర్శకత్వంలో జై లవకుశ సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ తో సినిమా కంప్లీట్ చేస్తాడు కొరటాల. ఎన్టీఆర్-కొరటాల సినిమాకు సంబంధించిన మిగతా డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి.