NTR Koratala Movie - జోరుగా ప్రీ-ప్రొడక్షన్

Friday,January 21,2022 - 03:17 by Z_CLU

NTR Koratala Movie NTR30 will launch next month

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ మరో సినిమాతో రాబోతుంది. ఇటివలే #NTR30 గా ఎనౌన్స్ అయిన ఈ కాంబో సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడులో జరుగుతుంది. వచ్చే నెల గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకోనుందని సమాచారం.

ఈ సినిమాకు యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు కొరటాల. తాజాగా అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ -అనిరుద్ కాంబోలో సినిమా కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అందుకే అనిరుద్ ని కన్ఫర్మ్ చేసి ఫ్యాన్స్ కి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని చూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలైంది. ఇప్పటికే కియరా , అలియా భట్ వంటి హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. అలియా RRR లో రామ్ చరణ్ తో జోడీ కట్టింది. ఇప్పుడు తారక్ తో జత కట్టబోతుందని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ లోపు స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసి నవంబర్ లేదా డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ వచ్చేసేలా ప్లానింగ్ జరుగుతుంది.