NTR Koratala - హిట్ కాంబినేషన్ రిపీట్స్

Monday,April 12,2021 - 01:11 by Z_CLU

 

టాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ వరకూ వెళ్లి పోస్ట్ పోన్  లేదా క్యాన్సల్ అవుతుంటాయి. తాజాగా రెడీ టు షూట్ వరకు వచ్చిన ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమా కూడా పోస్ట్ పోన్  అయ్యిందనే  రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమా క్యాన్సల్ అయ్యిందా ? లేదా పోస్ట్ పోన్ అయ్యిందా ? అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లో ఓ బ్లాక్ బస్టర్ కాంబో ఫిక్సయిందనే ప్రచారం జోరందుకుంది. అవును.. త్రివిక్రమ్ తో చేయాల్సిన తారక్ ఆ సినిమాకు బదులు నెక్స్ట్ కొరటాల శివతో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే తారక్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసిన కొరటాల త్వరలోనే ఆ సినిమాతో సెట్స్ పైకి వెళ్తాడని తెలుస్తుంది.

నిజానికి తారక్ త్రివిక్రమ్ తో కొరటాల బన్నీ తో సినిమాలు చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ ఇప్పుడు ప్లానింగ్ లో మార్పులు వచ్చాయట. అందుకే కొరటాల -ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యిందని టాక్. ఈ కాంబినేషన్ సినిమాను యువసుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ల పై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మించానున్నారని సమాచారం. #NTR30 సినిమాపై ఈరోజు 7 : 02 నిమిషాలకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. అది తారక్ -కొరటాల కాంబో సినిమానే అని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడని ఇన్సైడ్ టాక్.

koratala-ntr-new-movie

ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమా వెంటనే మళ్ళీ తారక్-కొరటాల కలిసి సినిమా చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ కమిట్ మెంట్స్ తో ఇద్దరూ బిజీ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. మరి ‘జనతా గ్యారేజ్’ తో చక్కని సందేశం అందించిన ఈ కాంబో నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈరోజు సాయంత్రం కల్లా ఈ కాంబో ప్రచారంపై పూర్తి క్లారిటీ రానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics