NTR జై లవకుశ అప్ డేట్స్

Tuesday,May 09,2017 - 01:43 by Z_CLU

NTR జై లవకుశ ఆల్రెడీ సెట్స్ పై ఉంది. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ ఓ చిన్న బ్రేక్ తరవాత మళ్ళీ ఈ రోజే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను, మరీముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక పాత బంగ్లాలో షూటింగ్ జరుగుతోంది. సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు.