ఎన్టీఆర్ హీరోయిన్స్

Saturday,January 28,2017 - 10:35 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే నెక్స్ట్ సినిమాలో తారక్ సరసన ఏ హీరోయిన్ నటించబోతుందా? అనే టాపిక్ ప్రెజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యంగ్ టైగర్ తో నటించబోయే హీరోయిన్స్ పై సోషల్ మీడియా లో పెద్ద చర్చే జరుగుతుంది.

ntr-kajal
ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ లిస్ట్ లో ముందుంది కాజల్ అగర్వాల్. తారక్ అంటే తనకి ఇష్టం అంటూ చెప్పే కాజల్ ని కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట యూనిట్. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం గర్ల్ గా మారిన కాజల్ ఆల్మోస్ట్ ఈ సినిమాకు ఫైనల్ అయిపోయిందనే వార్త కూడా వినిపిస్తుంది.

jodi-_-2

సమంత ఇటీవలే త్వరలోనే బిగ్ మూవీస్ లో నటించబోతున్నాను అంటూ చెప్పడం పైగా ఎన్టీఆర్-సమంత ది హిట్ పెయిర్ అవ్వడం తో ఈ సినిమాకు సామ్ కూడా ఫైనల్ అయ్యిందని టాక్.

jodi-_-3
ఇక లేటెస్ట్ గా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తారక్ సరసన నటించి విజయం లో భాగం అయినా రకుల్ ని కూడా ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. కానీ ప్రెజెంట్ ఈ స్టార్ హీరోయిన్ చేతిలో ఓ నాలుగు సినిమాలు ఉండడంతో రకుల్ ఈ సినిమాలో నటిస్తుందా? అనే డౌట్ అందరిలోనూ కలుగుతుంది.

jodi-_-4

ఈ సినిమాకు గతంలో తారక్ సరసన నటించిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ని కూడా సంప్రదిస్తున్నారని కానీ ప్రెజెంట్ శృతి దగ్గర ఈ సినిమాకు కేటాయించడానికి డేట్స్ లేవని టాక్ కూడా వినిపిస్తుంది.

jodi-_-5
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో ముందుగా వినిపించిన హీరోయిన్ పేరు రాశి కన్నా డే. ఈ భామ ఈ సినిమాకు హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండడం తో రాశి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మెరవడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.

jodi-_-6
ప్రెజెంట్ టాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ కూడా ఎన్టీఆర్ సినిమాలో మెరిసే ఛాన్స్ ఉంది.

jodi-_-7

ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ని కూడా ఎన్టీఆర్ కోసం సంప్రదిస్తున్నారట యూనిట్.