RRRలో 6 గెటప్పులు

Friday,August 07,2020 - 05:03 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోంది RRR మూవీ. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు కథతో పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు.

సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. సినిమాలో బ్రిటిష్ వాళ్లను ముప్పుతిప్పలు పెట్టే పాత్ర కొమరం భీమ్. ఈ పాత్రలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని టాక్.

కథకు తగ్గట్టు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ 6 గెటప్స్ లో కనిపిస్తాడట. బ్రిటిష్ వాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఇలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట ఎన్టీఆర్. ఆ గెటప్స్ తో పాటు బ్రిటిషర్ల నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఆర్ చేసే సాహసాలు సినిమాకు హైలెట్ అంటున్నారు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది.