ఎన్టీఆర్ కాకుంటే మరెవరు ?

Friday,September 22,2017 - 02:40 by Z_CLU

‘మహానటి’ టైటిల్ తో సావిత్రి బయోపిక్ గా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ , మోహన్ బాబు , సమంత ,దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ ఇలా కొందరు స్టార్స్ నటిస్తూ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు ఈ సినిమాలో మరో మెయిన్ రోల్ అయినా ఎన్టీఆర్ రోల్ లో ఎవరు నటిస్తారా..అనే చర్చ గట్టిగా నడుస్తుంది.

ఇంతకీ ఇంతటి చర్చకి కారణమైన ఆ క్యారెక్టర్ మరేదో కాదు నందమూరి తారక రామారావు… నిజానికి ఈ సినిమాలో సావిత్రి తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇదే. అందుకే ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఈ రోల్ ను జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయం పై రీసెంట్ గా స్పందించిన తారక్ ఈ రోల్ కోసం నన్నెవరూ సంప్రదించలేదని, ఈ రోల్ నేను చేస్తున్నానే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పేశాడు.

తారక్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో ఈ సినిమాలో ఈ రోల్ చేసేదెవరు..అనే చర్చ నడుస్తుంది. తారక్ కాకుండా ఈ రోల్ చేసే మరో నటుడెవరున్నారు..అనే ప్రశ్నలతో సతమవుతున్నారు ప్రేక్షకులు. మరి మహానటి టీం ఇప్పటి కైనా ఎన్టీఆర్ ను సంప్రదించి ఈ రోల్ కి తారక్ నే ఫిక్స్ అవుతారా…లేదా మరో నటుడితో ఈ క్యారెక్టర్ చేయిస్తారా.. ..చూడాలి.