హిట్ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన ఎన్టీఆర్

Thursday,September 08,2016 - 03:10 by Z_CLU

రీసెంట్ గా ఎన్టీఆర్-పూరి జగన్ కాంబినేషన్ లో టెంపర్ సినిమా వచ్చింది. ఆ సినిమా నుంచే తారక్ కు సక్సెస్ లు మొదలయ్యాయి. ఆ వెంటనే నాన్నకు ప్రేమతో, తాజాగా జనతా గ్యారేజ్ తో హిట్స్ అందుకున్నాడు యంగ్ టైగర్. ఇదే ఊపులో తారక్ తో మరో సినిమా చేద్దామనుకున్నాడు పూరి జగన్నాధ్. ఆ విషయాన్ని చాలా రోజుల కిందటే ప్రకటించాడు కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం… పూరీ జగన్నాధ్ చెప్పిన స్టోరీ లైన్ కు ఎన్టీఆర్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్… నెక్ట్స్ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాతే… సినిమా ఎనౌన్స్ చేస్తానని చెప్పాడు. కథారచయిత వక్కంతం వంశీని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాతో పాటు పూరీ జగన్నాధ్ సినిమాపై కూడా ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఆర్.