ఇజంపై కన్నేసిన ఎన్టీఆర్

Monday,October 17,2016 - 11:24 by Z_CLU

హిట్లు ఫ్లాపులతో సంబంధం ఏంటి భయ్యా… సిన్మా తీశామా లేదా…? అన్నట్టు ఉంటుంది పూరి జగన్ స్టయిల్. సరికొత్తగా ఉండే తన స్టోరీ లైన్స్ కొంత మందికి అంతగా ఎక్కకపోయినా టాలీవుడ్ స్టాండర్డ్స్ మార్చడానికి ట్రై చేసే అతి కొద్దిమంది డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ కూడా ఒకడు. ఈ వీకెండ్ విడుదలకానున్న ఇజం సినిమాతో మరో సక్సెస్ పై కన్నేశాడు జగన్.

ఇజం సినిమా కోసం ఫస్ట్ లుక్ నుండి ట్రేలర్ వరకు  పక్కా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న పూరి ప్రమోషన్స్ విషయంలో కూడా ఏ మాత్రం బ్యాలన్స్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. హీరో కళ్యాణ్ రామ్ తో పాటు పరోక్షంగా NTR కూడా ఈ సినిమా సక్సెస్ ని కాస్త సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తుంది.

collage-1

టెంపర్ లాంటి సూపర్ హిట్ ని ఇచ్చిన పూరితో ఇంకో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న NTR, ‘ఇజం’ సినిమా హిట్టయితే ఆ సక్సెస్ మీట్ లోనే తన తరవాతి సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ లాంటి డీసెంట్ హిట్ తరవాత మాంచి మాసివ్ మ్యానరిజం ఉన్న క్యారెక్టర్ చేయాలనే ఆలోచనలో NTR ఉన్నాడు కాబట్టి,   “ఇజం” హిట్ అయితే పూరి ఖాతాలో ఇంకో NTR సినిమా పడ్డట్టే.