డిఫరెంట్ లుక్ పై ఎన్టీఆర్ ఫోకస్

Sunday,February 12,2017 - 10:04 by Z_CLU

యంగ్ టైగర్ ఎట్టకేలకి నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న తారక్ ఫైనల్ గా నెక్స్ట్ సినిమా పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. బేబీ డైరెక్షన్ లో యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..

ntr-bobby

ఇక ‘టెంపర్’ సినిమా నుంచి ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తూ ఫాన్స్ ను ఖుషీ చేస్తూ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తారక్ ఈ సారి ఏకంగా ఓ మూడు డిఫరెంట్ లుక్స్ తో ఫిదా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకోసం హెయిర్ తో పాటు గడ్డం కూడా బాగా పెంచేసిన తారక్ ప్రెజెంట్ తన మూడు క్యారెక్టర్స్ కి సంబంధించిన లుక్ పై ఫోకస్ పెట్టి ఆ పనిలో పడ్డాడు. సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా కాస్త సమయమే ఉండడంతో ప్రెజెంట్ తన మెకోవర్స్ పై కేర్ తీసుకుంటూ స్టైలిస్ట్, మేకప్ మెన్ లతో బిజీ గా గడుపుతున్నాడట… మరి ఈ మూడు లుక్స్ తో యంగ్ టైగర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి..