ఇది నిజం.. ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదు

Tuesday,April 18,2017 - 01:36 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఊహించని పుకారు పుట్టుకొచ్చింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఓ కొత్త పార్టీ పెట్టాడంటూ రూమర్ క్రియేట్ అయింది. కేవలం పుకారు పుట్టడమే కాదు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పార్టీ ఇదేనంటూ ఓ అఫీషియల్ డాక్యుమెంట్ కూడా చక్కర్లు కొట్టింది. దాదాపు 3 రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ న్యూస్ పై ఎట్టకేలకు తారక్ క్లారిటీ ఇచ్చాడు.

తను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదని ప్రకటించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, ప్రస్తుతం రాజకీయాలతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని యంగ్ టైగర్ స్పష్టంచేశాడు. నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఓ లెటర్ హెడ్, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ లెటర్ హెడ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం ఈ హీరో బాబి దర్శకత్వంలో జై లవకుశ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్న టైమ్ లో ఈ పుకారు వచ్చింది. గతంలో పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉండేవాడు ఎన్టీఆర్. తాజాాగా రూమర్ రావడానికి ఇది కూడా ఓ కారణం. అయితే ఈమధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు యంగ్ టైగర్.