హాట్ టాపిక్ గా మారిన ఫోటో

Friday,March 24,2017 - 01:47 by Z_CLU

NTR సినిమా షూటింగ్ బిగిన్ అయింది. తన కరియర్ లోనే ఫస్ట్ టైం 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయనున్న ఈ సినిమా NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి నిన్న నందమూరి హరికృష్ణ విజిట్ చేశారు. ఆ ఫోటోని ట్వీట్ చేసింది NTR ఆర్ట్స్ సినిమా యూనిట్. అయితే ఆ ఫోటోలో ఉన్న హరికృష్ణ కన్నా మరో టాపిక్ హైలెట్ అయింది.

ట్వీట్ లో రిలీజైన ఫోటోలో NTR అంత స్పష్టంగా కనిపించకపోయినా, పక్కా ఫార్మల్ గెటప్ లో ఉన్నట్టు తెలిసిపోతుంది. దానికి తోడు తన ఎదురుగా ఉన్న టేబుల్ పై నేమ్ ప్లేట్ లో N. లవకుమార్ అని ఉండటంతో, ఈ సినిమాలో NTR ప్లే చేస్తున్న మూడు క్యారెక్టర్స్ లో ఒక పేరు లవకుమార్ అయి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఆల్ రెడీ ఫ్యాన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకి ఇప్పుడీ ఫోటో మరిన్ని డిస్కషన్స్ కి స్కోప్ ఇస్తుంది.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  రాశిఖన్నా ఆల్రెడీ ఒక హీరోయిన్ గా ఫిక్సయిపోయింది. ఇంకో హీరోయిన్ ఎవరో  తెలియాల్సి ఉంది.