శ్రీకాకుళంలో ‘NTR’ చైతన్యరథ యాత్ర

Tuesday,October 02,2018 - 11:03 by Z_CLU

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘NTR’ సెక్స్ట్ షెడ్యూల్ శ్రీకాకుళంలో జరగనుంది. అయితే NTR లైఫ్ లోని కీలక ఘట్టాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనుంది టీమ్. ఈ నెల 4 నుండి జరగనున్న రెగ్యులర్ షూటింగ్ లో NTR చైతన్య రథ యాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారు ఫిలిమ్ మేకర్స్.

అయితే NTR పొలిటికల్ కరియర్ లో హరికృష్ణ పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన్ని చైతన్య రథ సారథి అనే పిలుస్తారు. అయితే ఈ ఎపిసోడ్ లో హరికృష్ణ రోల్ ని ఎలివేట్ చేయనున్నారు ఫిలిం మేకర్స్. హరికృష్ణ రోల్ ప్లే చేయనున్న కళ్యాణ్ రామ్, ఈ షెడ్యూల్ నుండి సెట్స్ పైకి రానున్నాడు.

ఈ షెడ్యూల్ లో శ్రీకాకుళం తో పాటు వైజాగ్, అన్నవరం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చైతన్య రథ యాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనుంది టీమ్. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.