మార్చి 29 న గ్రాండ్ గా లాంచ్ కానున్న NTR బయోపిక్

Friday,March 23,2018 - 04:59 by Z_CLU

NTR బయోపిక్ మార్చి 29 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. అయితే ఈ కార్యక్రమం కోసం రామకృష్ణ స్టూడియోస్ లో  భారీ సెట్ వేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు , మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.

మార్చి 29 న పూజా కార్యక్రమాలతో పాటు N.T.R రోల్ లో కనిపించనున్న బాలకృష్ణ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనుంది సినిమా యూనిట్. ఈ సినిమాకి తేజ డైరెక్టర్. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న సినిమాతో బిజీగా ఉన్న తేజ, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేస్తారు.

 

ఈ సినిమాలో దాదాపు 60 గెటప్పులలో కనిపించనున్న బాలయ్య సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.