రేపు సెట్స్ పైకి రానున్న NTR బయోపిక్ మూవీ

Wednesday,December 27,2017 - 05:33 by Z_CLU

తేజ డైరెక్షన్ లో తెరకెక్కనున్న NTR బయోపిక్ షూటింగ్ రేపటి నుండి బిగిన్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్ సినిమా షూటింగ్ కాకుండా, ముందుగా టీజర్ ని షూట్ చేసుకుంటుంది సినిమా యూనిట్. జనవరి 18 న NTR వర్థంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది టీమ్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే నందమూరి ఫ్యాస్స్ లో ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తుంది. NTR లైఫ్ లోని రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని వీలైనంత త్వరలో బిగిన్ చేయాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి తో పాటు బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో NTR క్యారెక్టర్ లో బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.